వ్యాక్సినేషన్ లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎండగట్టారు. వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో కేంద్రం అనుసరిస్తున్న వ్యూహం నోట్లరద్దు కంటే తక్కువేం కాదని వ్యాఖ్యానించారు. ఈ రెండు అంశాల్లో సామాన్య ప్రజలు ఒకే రకంగా నలిగిపోతున్నారని మండిపడ్డారు. వరుసల్లో నిల్చోవాల్సి రావడం, డబ్బు వృథా చేసుకుని ఆరోగ్యాన్ని, ప్రాణాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాలసీ వల్ల చివరికి కొందరు బడా పారిశ్రామికవేత్తలకే లాభం చేకూరుతుందని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా, గతంలో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు బ్యాంకుల ముందు భారీగా క్యూలలో నిలబడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు బ్యాంకుల ముందే క్యూలైన్లలో ప్రాణాలు వదిలారు. ఇప్పుడూ వ్యాక్సిన్ పాలసీ వల్ల ఆ పరిస్థితులే వస్తాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.