తెలంగాణలో పారాబాయిల్డ్ రైస్ సేకరణపై కేంద్రం మరో ప్రకటన చేసింది. గత రబీ సీజన్ నుంచి 24.75 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరిస్తామని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ సీఎం అభ్యర్థన మేరకు 2021 సెప్టెంబర్ 30న అప్పటికే ఆమోదించిన 24.75 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి అదనంగా.. మరో 20 లక్షల టన్నుల పారాబాయిల్డ్ రైస్ తీసుకుంటామని కేంద్రం చెప్పింది. దీంతో గత రబీ నుంచి మొత్తం 44.75 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్, మిగతాది ముడి బియ్యం రూపంలో తీసుకుంటున్నామని వెల్లడించింది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement