దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘సుపరిపాలన వారోత్సవాలు’ ప్రారంభం కానున్నాయి. దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25ని ‘‘గుడ్ గవర్నెన్స్ వీక్’’గా నిర్వహిస్తున్నారు. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో లక్షలాది ఫిర్యాదులను పరిష్కరించనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబరు 20-25 వరకు నిర్వహించనున్నారు.
సోమవారం జరిగే ‘గుడ్ గవర్నెన్స్ వీక్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించనున్నారు. డిసెంబర్ 25న ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్’ విడుదల కానుంది. సోమవారం నుంచి సుపరిపాలన వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వారంలో కేంద్రం చేపట్టిన వివిధ సుపరిపాలన కార్యక్రమాలను హైలైట్ చేసేందుకు వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సుపరిపాలనను తీసుకెళ్లడమే ప్రచారం ప్రధాన అంశం.
కాగా, గత మంగళవారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులుతో సమావేశం అయిన సందర్భంగా వారు చేపట్టిన సుపరిపాలన కార్యక్రమాలపై చర్చించారు.