Tuesday, November 26, 2024

దేశంలో రూ.60 కే లీట‌ర్ పెట్రోల్ ?

దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు మరింత త‌గ్గించ‌డానికి సరి కొత్త ఆలోచన చేస్తోంది. లీటర్ పెట్రోల్ ను రూ.60కే అందిచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  చమరు ధ‌ర‌లు అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లపైనే ఆధార ప‌డి ఉంటుంది. అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధ‌రలు త‌గ్గితేనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి. కొన్ని సందర్భంగాల్లో క్రూడ్ ఆయిల్ తగ్గినా.. చమరు ధరల్లో మాత్రం మార్పు ఉండదు.

అయితే ఇక నుంచి దేశంలో పెట్రోల్ ఉత్ప‌త్తులు క్రూడ్ అయిల్ పై ఆధార ప‌డ‌కుండా కొత్త విధానం గురించి కేంద్రం ప్రబుత్వం ఆలోచిస్తోంది. ఇథ‌నాల్ బ్లెండింగ్ ను పెంచాల‌ని కేంద్రం భావిస్తుంది. దీని ద్వారా ఫ్లెక్స్ ఇందనం తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ను ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  కాగా, వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులను తీవ్ర ఆందోళన కలిగించాయి. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ రూ.115 దాటింది. ఈ క్రమంలో కేంద్ర.. పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: కేదార్‌నాథ్ లో ప్రధాని.. ఆలయంలో మోదీ పూజలు

Advertisement

తాజా వార్తలు

Advertisement