Saturday, November 23, 2024

మహిళలు ఈ న్యూస్ నమ్మకండి

మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకోనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. కరోనా వ్యాక్సినేషన్ తీసుకునేముందు మహిళలు తమ పీరియడ్స్ సమయాన్ని చెక్​ చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న న్యూస్​పై కేంద్రం స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. 18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 తర్వాత టీకా వేయించుకోవచ్చని తెలిపింది. మహిళలు పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత టీకా తీసుకోవద్దని, ఆ సమయంలో వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల టీకా తీసుకుంటే ప్రమాదమంటూ జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దుష్ప్రచారాన్ని మహిళలెవరూ నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విజ్ఞప్తి చేసింది.18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 తర్వాత టీకా వేయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 28 నుంచి cowin.gov.in లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement