Saturday, November 23, 2024

మరో రెండు టైగర్​ రిజర్వ్ సెంటర్లు.. పులుల సంరక్షణకు పర్మిషన్​ ఇచ్చిన కేంద్రం..

దేశంలో మరో రెండు కొత్త టైగర్​ రిజర్వ్​ ఫారెస్ట్లులు రానున్నాయి. ఈ రెండు కొత్త ప్రతిపాదనలతో  మధ్య ప్రదేశ్​ రాష్ట్రంలోని శివపురి, రతపానిలో రిజర్వ్​ కేంద్రాలు ఏర్పడనున్నాయి. ఈ రెండింటికి ఏర్పాటుతో   మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో పులులు ఉన్న రాష్ట్రంగా అవతరించింది. ఇప్పటికే ఆరు టైగర్ రిజర్వ్ లు,  పది జాతీయ ఉద్యానవనాలు మధ్యప్రదేశ్​లో  విస్తరించి ఉన్నాయి. కాగా,  శివపురిలో మాధవ్ నేషనల్ పార్క్ ను ప్రత్యేక టైగర్ రిజర్వ్ గా ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్రం కేంద్రాన్ని పర్మిషన్​ కోరింది. దీనితో పాటు ముఖ్యమంత్రి నుండి క్లియరెన్స్, ప్రజల ఆమోదం తర్వాత రతపాని వద్ద మరో టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు కొత్త ప్రాజెక్టుల  ఏర్పాటు వెనుక సింధియా రాజకుటుంబం,  పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హెల్ప్​ చేశారు.

కొన్ని నెలల క్రితం మంత్రి మాధవ్ నేషనల్ పార్క్ యొక్క ఔచిత్యాన్ని ఉదహరిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు లేఖ రాశారు.  “200 సంవత్సరాలకు క్రితం నుంచే మాధవ్ నేషనల్ పార్క్ పులుల సంఖ్యను కలిగి ఉంది. ఈ ప్రాంతం పూర్వపు గ్వాలియర్ రాజకుటుంబానికి రిజర్వ్ పార్క్ గా ఉండేది.  పెద్ద సంఖ్యలో పులుల ఆవాసంగా ఉంది. అందుకని ఇక్కడ మరో టైగర్​ రిజర్వ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర పర్యావరణ మంత్రి..‘‘టైగర్‌ సఫారీని ప్రారంభించడంతో పాటు మాధవ్‌ నేషనల్‌ పార్క్ ను టైగర్‌ రిజర్వ్ గా అభివృద్ధి చేసేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. మాధవ్‌లో టైగర్‌ సఫారీ కోసం మధ్యప్రదేశ్​ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన సెంట్రల్‌ జూ పరిశీలనలో ఉంది. అథారిటీ, టైగర్ రిజర్వ్ ప్రతిపాదన పరిశీలిస్తున్నాం ”అని ఆయన ప్రతిస్పందనలో తెలిపారు.

పెద్దపులుల కోసం అటవీ సంరక్షణ..

రాబోయే 5 సంవత్సరాల్లో మాధవ్ నేషనల్ పార్క్ లోని 1600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టైగర్ రిజర్వ్ ను అభివృద్ధి చేయాలి. ప్రారంభంలో  టైగర్ సఫారీని 100 హెక్టార్లలో ఏర్పాటు చేయాలి. ఒక సంవత్సరం లోపు సఫారీ కోసం మౌలిక సదుపాయాల అంచనా వ్యయం దాదాపు 20 కోట్ల రూపాయలు ఉంటుంది అని సీనియర్ అటవీ అధికారి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement