Saturday, November 23, 2024

రాష్ట్రాలకు టీకాలే పంపని కేంద్రం… దేశ ప్రజలందరికీ ఎలా వేస్తారు?

డిసెంబరు నాటికి దేశ ప్రజలందరికీ టీకాలు వేస్తామన్న కేంద్రం ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. రాష్ట్రాలకు టీకాలే పంపని కేంద్రం దేశం మొత్తానికి టీకాలు ఎలా వేస్తుందని ప్రశ్నించారు. కేంద్రం తొలుత అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాల్లో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌ల నుంచి వ్యాక్సిన్ల‌ను సేక‌రించి రాష్ట్రాల‌కు ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు.
 
కాగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని కేంద్రం ఇటీవ‌ల ప్రకటించిన సంగతి తెలిసిందే. సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వంటి దేశీయ సంస్థలు ఉత్పత్తి చేసిన టీకాలను దేశంలోని అర్హులైన మొత్తం ప్రజలకు డిసెంబరు చివరినాటికి అందజేస్తామని తెలిపింది. డిసెంబర్‌ నాటికి 108 కోట్ల మందికి టీకాలు వేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్న వేగవంతమైన దేశాల్లో భారత్‌ రెండవదని తెలిపారు. ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించామని తెలిపారు. 2021లోపే భారత్‌లో వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తవుతుందని..దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్లూప్రింట్‌ ఇచ్చిందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి : ప్రైవేటు దోపిడీకి కళ్ళెం.. 6 ఆస్పత్రుల లైసెన్స్ రద్దు

Advertisement

తాజా వార్తలు

Advertisement