Tuesday, November 19, 2024

జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్లు: నితిన్ గడ్కరీ

ఏడాదిలోగా దేశంలో ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వీటి స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. జీపీఎస్ ఆధారంగా ప్రతి వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి టోల్ ఫీజును వసూలు చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం దాదాపుగా అన్ని వాహనాల్లోనూ వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటోంది. కాబట్టి జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. వాహనాల కదలికలను బట్టి వాహనదారుల బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా టోల్ ఫీజును జమ చేసుకునే కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. 93 శాతం మంది ప్రస్తుతం వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లిస్తున్నారు. కాగా 7 శాతం మంది మాత్రం ఫాస్టాగ్ ఉపయోగించకుండా రెట్టింపు టోల్ కడుతున్నారని గడ్కరీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement