సెంట్రల్ మెక్సికోలోని రహదారిపై టోల్ బూత్ వద్ద ఆపి ఉన్న వాహనాలపైకి ఓ రవాణా ట్రక్కు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగాయి. దాంతో 19మంది మృతి చెందగా..ఐదుగరు తీవ్రంగా గాయపడ్డారు. తొమ్మిది వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి..ట్రక్కు బ్రేకులు విఫలం కావడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు..గ్లూ(glue)ను తరలిస్తున్న ఓ ట్రక్కు.. టోల్బూత్ వద్ద బ్రేకులు ఫెయిల్ అవ్వగా ఈ ప్రమాదం జరిగిందని మెక్సికో అగ్నిమాపక శాఖ అధికారి ఆర్డియన్ డియాజ్ చావెజ్ తెలిపారు. మెక్సికోలోని చాల్కో ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.
ఆగిఉన్న వాహనాలపై దూసుకెళ్ళిన ట్రక్కు..’19’మంది మరణం..5గురి పరిస్థితి విషమం..
Advertisement
తాజా వార్తలు
Advertisement