గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి. మరోవైపు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 16,354 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.77 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 (220,66,09,015) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,71,551 మంది కోలుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కేరళ లో ముగ్గురు, గోవా , గుజరాత్ లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. దీంతో కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,876కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.04 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement