తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధి అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం.. రాష్ట్రాలతో చర్చించేందుకు సిద్ధమైంది. నాలుగు కీలకమైన అంశాలపై చర్చించేందుకు మంగళవారం(డిసెంబర్ 28) తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ భేటీలో చర్చించబోయే అంశాలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్.. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సోమేశ్ కుమార్, సమీర్ శర్మకు లేఖ రాశారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..