Tuesday, November 26, 2024

జూన్ 30 వరకు గడువు పెంచిన కేంద్రం

దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్రం శుభవార్త అందించింది. ఎక్స్‌పైరీ అయిన డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు కేంద్రం పెంచింది. కరోనా పాజిటివ్ కేసుల కారణంగా వాటిని రెన్యువల్ చేసుకోవడంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా గడువు పెంచింది. అంటే గత ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత ఎక్స్‌పైరీ అయిన వాటి గడువు 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది. గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో తాజాగా గడువు పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement