Friday, November 22, 2024

సహజీవనానికి కనీస వయస్సును తగ్గించే ఉద్దేశం కేంద్ర ప్ర‌భుత్వానికి లేదు.. స్మృతి ఇరానీ

మైన‌ర్లు నేరాల‌కు పాల్ప‌డితే పోక్సో చ‌ట్టంలోని సెక్ష‌న్34 ప్ర‌కారం ప్ర‌త్యేక‌కోర్టు కేసులు విచారిస్తుంద‌ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ప్రత్యేక కోర్టు ద్వారా వయస్సును నిర్ణయించే ప్రక్రియను జరుగుతుందన్నారు. 1999లో సవరించిన మెజారిటీ చట్టం-1875 ప్రకారం మెజారిటీ సాధించేందుకు 18 ఏళ్లు పూర్తి కావాలని తెలిపారు. బాల్య వివాహాలపై మరో లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం బాల్య వివాహాల కేసులు సంవత్సరాలుగా పెరిగాయని తెలిపారు. బాల్య వివాహాలపై అవగాహన ఉన్న కేసులు పెరగడం విచారకరమన్నారు.

2019లో 523, 2020లో 785, 2021లో 1050 బాల్య వివాహాలు నమోదయ్యాయని తెలిపారు.కేసులను ఎక్కువగా నివేదించడం అనేది బాల్య వివాహాల సంఖ్య పెరుగుదలను సూచించాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి సంఘటనలను నివేదించడానికి బేటీ బచావో బేటీ పడావో (BBBP), మహిళా హెల్ప్‌లైన్ (181) వంటి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ఏకాభిప్రాయంతో సహజీవనం చేయాలంటే ప్రస్తుతం ఉన్న కనీస వయస్సు 18ఏళ్ల నిబంధనలో ఎటువంటి మార్పులేదని కేంద్రం తెలిపింది. సహజీవనం చేయాలనుకునేవారి కనీస వయస్సు 18 నుండి 16 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర మహిళా , శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డబ్ల్యుసిడి) పార్లమెంటుకు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వానికి సహజీవన కనీస వయస్సును తగ్గించే ఉద్దేశంలేదని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement