Saturday, November 23, 2024

రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్: కేంద్ర ప్రభుత్వం

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. దీంతో వాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు భరోసాను ఇచ్చే ఈ విధంగా కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. కోవాక్సిన్, కోవీషీల్డ్ డోషులను రూ 150/- కి కొనుగోలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. కొనుగోలు చేసిన వ్యాక్సిన్ను రాష్ట్రాలకు ఉచితంగా అందించనుంది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌ కొవిషీల్డ్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్ తో పాటు ప‌లువురు నేత‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.కేంద్ర స‌ర్కారుకి ఒక డోసును రూ.150కి అమ్మి, రాష్ట్రాలకు మాత్రం రూ.400 విక్రయించడమేంటని వారు ప్రశ్నించారు. ఈ తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ఉచిత వ్యాక్సిన్‌పై కేంద్ర స‌ర్కారు వెన‌క‌డుగు వేసింద‌ని కాంగ్రెస్ నేత చిదంబ‌రం కూడా నిన్న అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో తాము ఉచితంగానే రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తామ‌ని కేంద్ర స‌ర్కారు కీల‌క‌ ప్ర‌క‌ట‌న చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేసే వ్యాక్సిన్ ధ‌ర రూ.150 మాత్ర‌మే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఆ ధ‌ర‌కే కొనుగోలు జ‌రిపి, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉచితంగా అందిస్తామ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌ స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement