కరోనా చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం అత్యధిక కేసులున్న 19 రాష్ట్రాలకు ఈ నెల 30 వరకు 11 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 59 వేలు, తెలంగాణకు 21,500 కేటాయించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్రకు అత్యధికంగా 2,69,200, గుజరాత్‌కు 1,63,500, ఉత్తర్‌ప్రదేశ్‌కు 1,22,800, మధ్యప్రదేశ్‌కు 92,400, ఢిల్లీకి 61,900 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దేశంలో ఈ ఔషధానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం నెలవారీ ఉత్పత్తిని 38 లక్షల వయల్స్ నుంచి 74 లక్షల వయల్స్‌కి పెంచినట్లు, కొత్తగా 20 తయారీ సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించింది. వైద్య, ఆరోగ్యశాఖ జారీ చేసిన క్లినికల్ ప్రొటోకాల్ ప్రకారం రెమ్‌డెసివిర్‌ను అకస్మాత్తుగా రోగం తీవ్రస్థాయికి చేరి, తప్పనిసరిగా ఆక్సిజన్‌పై ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement