Sunday, November 24, 2024

అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన

కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లను సమీక్షించనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్‌ తెలిపారు. మొదటి రోజు ఎక్సైజ్ ఆదాయపన్ను, రవాణా శాఖల అధికారులతో, బ్యాంకువాళ్లతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు సమావేశం కానున్నారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర కానుకల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలపై చర్చిస్తారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూడా సీఈసీ బృందం భేటీ కానుంది. రెండో రోజు పోలీస్ కమిషనర్లతో సమావేశమై జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనుంది. ఇక మూడో రోజు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. అంతేకాదు స్వీప్ ఎగ్జిబిషన్ సందర్శన, వివిధ వర్గాల ఓటర్లతో కూడా ఓటింగ్ విషయమై చర్చించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement