Tuesday, November 5, 2024

ఇవ్వాల భేటీ కానున్న కేంద్ర కేబినెట్‌.. సాగు చ‌ట్టాల‌పై తీర్మానం

ఇవ్వాల కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ఈ కీలక భేటీ నిర్వ‌హించేందుకు కేంద్రం స‌న్న‌ద్ద‌మైంది. సాగ చట్టాల రద్దు అంశంపై చర్చ జరుగనుంద‌ని తెలుస్తోంది. ఈ మ‌ధ్య యావ‌త్ దేశ ప్ర‌జ‌ల‌కు ప్రధాని నరేంద్ర మోడీ సారీ చెబుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ విష‌యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇవ్వాల కేంద్ర కేబినెట్ వ్యవసాయ చట్టాల రద్దు తీర్మానాన్ని ఆమోదించే చాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు లోక్ స‌భ‌లో ప్రవేశ పెట్టనున్న వివిధ బిల్లులపై చర్చ, తీర్మానాలు పెట్టే అవకాశం ఉంది.

మరోవైపు సాగు చట్టాలు ర‌ద్దు అయితేనే తాము ఇళ్లకు వెళ్తామని రైతులు ఢిల్లీలో భీష్మించుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనలను ఇంకా కొనసాగిస్తున్నారు. కాగా, పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే సాగు చట్టాల రద్దు బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రైతుల నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ముందుగా సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement