ప్రతి పథకంలోనూ కేంద్రం వాటా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ… నిధులు పక్కదారి పట్టకుండా డిజిటలైజేషన్ తెచ్చామన్నారు. 60శాతం నిధులు కేంద్రం ఇస్తే.. 40శాతం రాష్ట్రాలు భరించాలన్నారు. తెలంగాణలో 55శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందన్నారు. ఆదిలాబాద్ లో ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎంపీ ఫోటో పెడతారా అని అన్నారు. రాజీనామా సవాళ్లను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రం వాటా ఉన్నప్పుడు పేరుపెట్టడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు పేరు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ లో 2021 వరకు తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించారు.
ప్రతి పథకంలో కేంద్రం వాటా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Advertisement
తాజా వార్తలు
Advertisement