Monday, November 18, 2024

Breaking: దేశంలో చెక్ బౌన్స్ కేసుల‌పై కేంద్రం కీలక నిర్ణయం..

చెక్ బౌన్స్ కేసులు దేశ‌వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసులు పెండింగులో ఉన్నాయి. దాన్ని కట్టడి చేసేందుకు, నేరస్తులపై కఠిన చర్యలకు సమాయత్తమ‌వుతోంది. చెక్ జారీ చేసిన అకౌంట్ లో నిధులు లేక బౌన్స్ అయితే సదరు వ్యక్తి మరో ఖాతా నుంచి డెబిట్ చేయాలనే ప్రతిపాదనను నిపుణులు కేంద్ర ఆర్థిక శాఖకు సూచించారు. అదేవిధంగా నేరస్తుడి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ను కంపెనీలకు నిషేధించాలని, వారు కొత్త అకౌంట్లు తెరవకుండా చూడాలని ప్రతిపాదించారు. దీంతో వీటిపై చట్టపరమైన సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement