Friday, November 22, 2024

పాన్, ఆధార్ లింక్ పై కేంద్రం కీలక ప్రకటన..

పాన్‌ కార్డు – ఆధార్‌కార్డుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆధార్‌ అనుసంధానం లేని పాన్‌కార్డులు 2023 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి చెల్లవని స్పష్టం చేసింది. 2023 మార్చి 31లోగా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఒక ప్రకటనలో కోరింది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు వర్గం పరిధిలోకి రాని పాన్ హోల్డర్లందరూ 31-3-2023లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరని తెలిపింది. ఆధార్‌ కార్డు అనుసంధానం చేయని పాన్‌కార్డులు పని చేయవని హెచ్చరించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement