Friday, November 22, 2024

Spl Story: రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం.. ఎడ్యుకేషన్​ సిస్టమ్​ని దెబ్బతీసే కుట్ర!

కేంద్రంలోని బీజేపీ (ఎన్​డీఏ) ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించే కుట్రలకు తెగబడుతోంది. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు అన్న సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు విపరీతమైన పోకడలు పోతోంది. అందులో భాగంగా పలు సంస్కరణలను తెరమీదికి తీసుకొస్తుంది. అయితే.. వీటిలో చాలా మటుకు రాష్ట్రాలు ఆమోదయోగ్యం తెలుపకున్నా బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తోంది. తొలుత రైతులను దెబ్బతీసేలా మూడు చట్టాలు చేసి అమలు చేయడానికి ప్రయత్నించింది మోదీ ప్రభుత్వం. ఈ చట్టాల విషయంలో దేశవ్యాప్త ఆందోళనలు, ఏడాదికి పైగా సాగిన ఉద్యమంతో ప్రధాని మోదీ యావత్ దేశ ప్రజలకు,  రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే.. ఇదంతా ఉత్తర ప్రదేశ్​ ఎన్నికలకు ముందు ఆడిన నాటకమని, ఓట్ల కోసం ఈ ఎత్తుగడ పన్నారని కొంతమంది విమర్శకులు చెబుతున్నారు. ఇప్పుడు స్కూల్​ సిస్టమ్​ని దెబ్బతీసేలా సంస్కరణలు తీసుకొస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

విద్యుత్​ సంస్కరణల పేరిట రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవాలన్న కేంద్రం ఆశలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యతిరేకిస్తున్నారు. అయితే.. చాలా రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ‘ఈడీ, మోడీ’ భయంతో కేంద్రం చెప్పినట్టు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని కేసీఆర్​ అసెంబ్లీ వేదిక స్పష్టం చేశారు. తాను బతికి ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది తలెత్తనీయబోనని మాట ఇచ్చారు.

కాగా, మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీలో సీఎం జగన్​మోహన్​రెడ్డి మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టడంలో తప్పులేదని, ఇంకా వ్యవసాయానికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే.. కేంద్రం చెప్పుచేతల్లో తైతక్కలాడుతున్న ఏపీ సీఎం.. ఈడీ, సీబీఐ వంటి కేసులకు భయపడే ఇట్లా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని చాలామంది పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు.

ఇక.. ఇప్పుడు కేంద్రం మరో కుట్రకు తెరదీస్తోంది. రైతులు, వ్యవసాయ మోటార్లు (విద్యుత్​ సంస్కరణలు) అయిపోయాయి.. ఇప్పుడు ఎడ్యుకేషన్​ని దెబ్బతీసేలా సంస్కరణలు తీసుకొస్తోంది. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా ఈ సంస్కరణలు తీసుకురావడాన్ని ప్రజాస్వామిక వాదులు, పలువురు ముఖ్యమంత్రులు తప్పుపడుతున్నారు. రాష్ట్రాలతో కేంద్రానికి రిలేషన్​ దిబ్బతింటోందని, కేంద్రం పూర్తిగా ఫెడరల్​ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని చెబుతున్నారు.

- Advertisement -

ఎడ్యుకేషన్​ సిస్టమ్​లో సంస్కరణలు ఏంటంటే..​

పాఠశాలల దిశను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం PM SHRI (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) అనే స్కీం ను ప్రక‌టించింది. పాఠశాలలను ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసే ఉద్దేశంతో ఈ స్కీం ను లాంచ్ చేశారు. అయితే దేశంలో 10.32 ల‌క్షల పాఠ‌శాల‌లున్నాయి. అందులో 14,500 పాఠ‌శాల‌ను అంటే 0.014 శాతం బడులను ఎంపిక చేసి.. వాటి అభివృద్ధి కోసం ఐదేండ్లలో 27,360 కోట్లు అంటే ఏడాదికి  5472 కోట్లను ఖ‌ర్చు చేస్తారు. (అన్ని పాఠ‌శాల‌కు ఈ ప‌థ‌కం అమ‌లు కావ‌లంటే క‌నీసం 350 సంవ‌త్సరాలు ప‌డుతుంది‌).

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన National Education Policy (NEP)ను అమ‌లు చేసే రాష్ట్రాల‌కే PM SHRI  నిధులు మంజురు చేస్తామ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. అయితే కేంద్రం ఏక ప‌క్షంగా NEP అమలు చేయడాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అందుకే PM SHRI సాకుతో National Education Policy ని  రాష్ట్రాల‌పై కేంద్రం బ‌ల‌వంతంగా రుద్దుతుంద‌ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఇది స‌మాఖ్య వ్యవ‌స్థకు విరుద్ద‌మ‌ని.. రాష్ట్రాల హ‌క్కులు హ‌రించ‌డ‌మే అవుతుందని చాలా రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి.

మోట‌ర్లకు మీట‌ర్లు పెడితే  అదనంగా అప్పులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆశ పెట్టిన‌ట్లుగానే….  నిర్భందంగా National Education Policyని అమలు చేస్తేనే పాఠశాలల అభివృద్ధి కోసం నిధులు మంజురు చేస్తామంటుంది కేంద్రం. రాష్ట్రాల ఆర్దిక అవ‌స‌రాల‌ను ద్రుష్టిలో ఉంచుకుని బ్లాక్ మేయిల్ చేస్తున్న కేంద్ర చేష్ట‌ల‌ను ఎన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయో చూడాలి?

Advertisement

తాజా వార్తలు

Advertisement