Friday, November 22, 2024

పార్లమెంటులో ఈనెల 20న మహిళా బిల్లు.. ప్రవేశపెట్టనున్న కేంద్రం!

ఎమ్మెల్సీ కవిత పోరాటం ఫలించనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఈ బిల్లుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఈరోజు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

కొత్తగా నిర్మించిన భవనంలో రేపటి నుంచి ఈ సమావేశాలు జరుగనున్నాయి.పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని కోట్లాది మహిళల పక్షాన ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష కూడా చేపట్టారు. అంతేకాకుండా ఈ బిల్లుకు మద్దతు పలకాలని దేశంలోని 49 రాజకీయ పార్టీలను కోరారు. దీనికి రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని, అందరూ ఒక్క మాటపై నిలబడి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒత్తిడి తేవాలని ఆమె ఆయా పార్టీలను అభ్యర్థించారు. ఈ క్రమంలో కేంద్రం మహిళా బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement