అమరావతిపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ.. 2022-23 బడ్జెట్‍లో కేంద్రం కేటాయింపులు చేసింది. విభజన చట్టం ప్రకారం కేంద్రం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే బడ్జెట్‍లో ప్రొవిజన్ కేంద్రం పెట్టింది. కేంద్ర బడ్జెట్‍లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధుల కేటాయించింది. అలాగే సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital