కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేసులను కట్టడి చేసేందుకు టెస్ట్-ట్రాక్-ట్రీట్ అనే మూలసూత్రాన్ని పాటించాలని ఆదేశించింది. ఎక్కువగా ర్యాపిడ్ టెస్టులపై ఆధారపడకుండా, ఆర్టీపీసీఆర్ టెస్టులను 70శాతానికి పెంచాలని సూచించింది. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా తగు చర్యలను చేపట్టాలని సూచించింది. అయితే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులు, రవాణాపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించరాదని, మాస్కులు, శానిటైజర్ వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మాస్కులు వాడకుండా నిర్లక్ష్యం వహించేవారిపై భారీగా జరిమానాలు విధించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement