గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. కోవిడ్ సందర్భంగా విధించిన ఆంక్షలన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో ఎత్తేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఇక.. కరోనా కేసుల విషయంలో ప్రతి రోజూ రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షలు నిర్వహించాలని కూడా సూచించారు. టెస్టులు, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధలు.. వీటిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సమీక్షలు నిర్వహించాలని, ఒకవేళ కోవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే ఆంక్షలను విధించాలని, లేని పక్షంలో ఆంక్షలను సడలించాలని ఆయన లేఖలో సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital