Friday, November 22, 2024

Auction | బొగ్గు గనుల వేలానికి కేంద్రం శ్రీకారం.. లిస్ట్ లో సింగరేణిలోని నాలుగు బ్లాకులు (Video)

దేశంలోని బొగ్గు గనుల కమర్షియల్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల (శనివారం) మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు (బ్లాకులు) గనులను కూడా వేలానికి పెట్టింది. అయితే ఇప్పటికే సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

కాగా, మొన్నీమధ్య తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ రామగుండంలో జరిగిన సభలో మాట్లాడుతూ బొగ్గు గనులను వేలం వేయబోమని చెప్పారు. అయితే.. ఇప్పడు అదే బొగ్గు గనులను ప్రధాని మోదీ అమ్మేందుకు రంగం సిద్ధం చేసిన విషయం బయటికి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల కంపెనీగా గుర్తింపు తెచ్చుకుని, లాభాల్లో వున్న కోలిండియాలో వాటాలు విక్రయించడంపై పలువురు మండిపడుతున్నారు. కోలిండియాలోని 49 శాతం వాటాలను ప్రైవేట్ వాళ్లకు విక్రయిస్తామని గతంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కేంద్రం పావులు కదుపుతోంది. 

కానీ, ప్రధాని మోదీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా 51శాతం ఉంది.. కేంద్రం వాటా కేవలం 49 శాతం మాత్రమే అట్లాంటిది తామెందుకు బొగ్గు గనులను అమ్ముతాము.. ఇదంతా అబద్ధపు ప్రచారం అని సభలో చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై బీజేపీ నేతలు కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఏం సమాధానం చెబుతారని నెటిజన్లు నిలదీస్తున్నారు. వీడియోని చూసి బీజేపీ తీరును ఛీ కొడుతున్నారు.

- Advertisement -

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement