అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటాయి. సికింద్రాబాద్ లో, బీహార్ రాష్ట్రంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అగ్నిపథ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు రైళ్లకు నిప్పంటించారు. అలాగే బైక్ లను తగులబెట్టారు. రైల్వే స్టేషన్లలో ఉన్న స్టాళ్లను, దగ్ధం చేసి విధ్వంసం చేశారు. ప్లాట్ ఫాం పై ఉన్న రైళ్లపై రాళ్లు రువ్వారు.
దీంతో రైల్వే స్టేషన్లలో ఉన్న ప్రయాణీకులు భయంతో పరుగులు పెట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడు రైళ్లకు నిప్పంటించారు. పోలీసులు ఆందోళన కారులపై లాఠీ ఛార్జీ చేశారు. అంతే కాకుండా పోలీసులు యువకులను అదుపు చేసేందుకు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. అయితే కేంద్రం నిరసనలపై అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసింది.