Monday, November 18, 2024

వనరక్షణకు సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం కృషి చేయాలి : కేటీఆర్

వనరక్షణకు ఓరియంట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం కృషి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవాపూర్‌లోని ఓరియంట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రులు ఇద్రకరణ్‌ రెడ్డి, మహమూద్‌ అలీతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం బెల్లంపల్లిలో రూ.30 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి, రూ.44 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాన్ని ప్రారంభించారు.

అనంత‌రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఓరియంట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో రూ.2 వేల కోట్లతో చేపట్టిన 4వ ప్లాంట్‌ ఏర్పాటుతో పర్యావరణ కాలుష్యం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కొత్త ప్లాంట్‌లో దేవాపూర్‌ గ్రామస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బెల్లంపల్లి యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు వచ్చేలా చేయాలని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement