త్వరలో జనరల్ ఎలక్షన్స్ జరగున్న పలు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ మేరకు సీఈసీ ఇవ్వాల (శుక్రవారం) రాత్రి అయిదు రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, మిజోరాం రాష్ట్రాలున్నాయి.
కాగా, సీఈసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల డ్యూటీలో పాల్గొనే అధికారులు సొంత జిల్లాకు చెందిన వారై ఉండకూడదు. ఇక.. ప్రస్తుతం ఉన్న పోస్టింగులో మూడేండ్లకు మించి విధుల్లో కొనసాగరాదు. ఈ ఆదేశాలను ఆయా రాష్ట్రాల సీఈవోలు తప్పకుండా పాటించాలని సీఈసీ ఆదేశించింది.