దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజుకు లక్షకు పైగా కొత్త కేసులతో పాటు వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. అయితే కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ఈసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండదని ప్రకటించింది. అయితే మరో 20 రోజుల్లో జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలు యథాతథంగా జరుగుతాయా ? లేదా ? అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది.
అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలతో పాటు పలు రాష్ట్రాల అధికారులు, ప్రముఖులు సైతం ఈ పరీక్షలు వాయిదా వేయాలని సీబీఎస్ఈ బోర్డుతో పాటు కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్ఈ బోర్డు, కేంద్ర విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో పరీక్షల వాయిదా అంశం చర్చకు రానుందని తెలుస్తోంది. 90 శాతం CBSE పరీక్షలు వాయిదా పడొచ్చని సమాచారం. కాగా షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సి ఉండగా.. 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 15 వరకు జరగాల్సి ఉంది.CBS