Monday, November 18, 2024

Fraud Leader: వెయ్యి కోట్ల ఆస్తి కొట్టేసేందుకు బీజేపీ మంత్రి ప్లాన్​.. సీబీఐ దర్యాప్తులో ఏం తేలనుందో!

మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ బడా లీడర్​.. తాను మంత్రిగా ఉన్న సమయంలో వెయ్యి కోట్ల ప్రైవేటు ఆస్తులను కాజేసేందుకు యత్నించిన అంశంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 2018 నుంచి 2020 మధ్య కాలంలో మరాఠా విద్యాప్రసార్​ సహకారి సమాజ్​ సంస్థకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఆ సంస్థ డైరెక్టర్​ని కిడ్నాప్​ చేసి, చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాకుండా తాము చెప్పినట్టు వినకుంటే చంపేస్తామని బెదిరించారు. అప్పట్లో ఎఫ్​ఐఆర్​ నమోదైనా ఇప్పటికీ దీనిపై చర్యలు తీసుకోలేదు. తాజాగా ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇంత నీచానికి ఒడిగట్టిన బీజేపీ మంత్రిపై మరి చర్యలు తీసుకుంటారా? లేక కేసు లేపేసి నిర్ధోషిగా ప్రకటిస్తారా చూడాలి!

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

కిడ్నాప్, దోపిడీ, దొంగతనం వంటి వాటితోపాటు ఇతర నేరారోపణలపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ లీడర్​ గిరీష్ మహాజన్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మరో 28 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద పలు సెక్షన్లపై ఈ కేసు దాఖలైంది. కాగా, ఈ కేసు 2020 డిసెంబర్ లో నమోదైన విజయ్ పాటిల్ పెట్టిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించినదని తెలుస్తోంది.

జల్గావ్ జిల్లాలో పలు కళాశాలలు, ఇన్‌స్టిట్యూట్‌లను నడుపుతున్న సహకార విద్యా సంస్థ అయిన జిల్హా మరాఠా విద్యాప్రసారక్ సహకరి సమాజ్ డైరెక్టర్‌లలో పాటిల్​ ఒకరు. ఆ సంస్థకు చెందిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 1,000 కోట్ల దాకా ఉంటుంది. ఇక.. పాటిల్ వాంగ్మూలం ప్రకారం.. జనవరి 2018, డిసెంబర్ 2020 మధ్య ఈ నేరం జరిగినట్టు తెలుస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులు నేరపూరిత కుట్రలో భాగంగా పాటిల్ తన సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు ఎఫ్‌ఐఆర్ పొందుపరిచారు.

2018లో తాను పూణెలో పర్యటించినప్పుడు సదాశివపేట ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లోకి తనను బలవంతంగా తీసుకెళ్లారని.. అక్కడ తనను కొట్టి, నిందితుల ఆదేశాలను పాటించకుంటే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో ఉంది. జల్గావ్‌కు చెందిన విద్యా సంస్థపై పట్టు సాధించేందుకు నిందితులు ఫోర్జరీకి పాల్పడ్డారని పాటిల్ తెలిపారు. దీని తర్వాత తనను పదేపదే బెదిరించరని, డిసెంబర్ 2020లో ఫిర్యాదుదారుడు జల్గావ్‌లో మహాజన్, ఇరత 28 మందిపై కేసు పెట్టాడు.

- Advertisement -

అప్పట్లో నమోదైన ఈ ఎఫ్‌ఐఆర్ జనవరి 2021లో పూణేలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా, ఈ ఏడాది జులైలో మహారాష్ట్ర ప్రభుత్వం దీని దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అప్పటి బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ సహా ఫిర్యాదుదారుడు నిందితులుగా పేర్కొన్న 29 మందిపై సీబీఐ సెప్టెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై సీరియస్​గా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement