భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచ తూర్పు బజారులో కుమార్తె సహా దంపతుల సజీవదహనం ఘటనలో కీలక మలుపు చోటుచేసుకంది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పాల్వంచ ఏఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం రాఘవేందర్ పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచ తూర్పు బజారులో ఇంట్లో గ్యాస్ లీకేజీతో రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులతో సహా కుమార్తె సాహిత్య(12) సజీవదహనమయ్యారు. మంటలు అంటుకొని మరో కుమార్తె సాహితికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి 80శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తొలుత ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిందని సమాచారం అందినా.. తమకు అందిన ప్రాథమిక సమాచారంతో దీన్ని ఆత్మహత్యగా పోలీసుల భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ రామకృష్ణ కారులోని కొన్ని కీలక పత్రాలు, బిల్లులను స్వాధీనం చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital