తనను లైంగింకంగా వేధించాడని పుష్ప చిత్రంలో ఊ అంటావా..ఊఊ అంటావా మామ సాంగ్ కి డ్యాన్స్ కంపోజ్ చేసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యపై ఓ మహిళా ఫిర్యాదు చేసింది. శృంగారంలో పాల్గొనాలని తనను బలవంతం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు పోర్న్ వీడియోలు చూపింది, ఎంతో వేధించాడని తెలిపింది. తనతో శృంగారానికి ఒప్పుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని చెప్పింది. తాను ఒప్పుకోకపోయేసరికి గణేశ్ మాస్టర్, ఆయన అసిస్టెంట్లు తనపై దాడి చేశారని… 6 నెలల కాలంలోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ లో సభ్యత్వాన్ని రద్దు చేయించారని బాధితురాలు తెలిపింది. వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశానని… నాన్ కాగ్నిసబుల్ కేసును నమోదు చేశానని, తదుపరి చర్యల కోసం లాయర్ ను కూడా సంప్రదించానని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు 354 ఏ, 354 సీ, 354 డీ, 509, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement