వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్‌ను దుర్భాషలాడిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయంపై తాండూరు సీఐ రాజేందర్‌కు ఫోన్ చేసిన మహేందర్‌రెడ్డి… రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా?… అంటూ నోటికొచ్చినట్లుగా దూషించారు. నీ అంతు చూస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో క్లిప్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు జరిగిన అవమానంపై సీఐ రాజేందర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహేందర్‌రెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారని, తనను దూషించి, బెదిరించారని సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిపై 353, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు.
తాండూరు సీఐని దుర్భాషలాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. పట్నం మహేందర్ రెడ్డిపై కేసు
Advertisement
తాజా వార్తలు
Advertisement