ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పాయల్ మాస్క్ ధరించలేదని కేసు నమోదైంది. అయితే మాస్కు ధరించకపోవడంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ కేసు నమోదైంది. మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించలేదని, ఆమెతోపాటు షాపింగ్ మాల్ యాజమాన్యం కూడా మాస్కులు ధరించలేదని, భౌతిక దూ/రాన్ని గాలికి వదిలేశారని పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్ బాబ్జీ తరపున ఆయన న్యాయవాది డొంకెన రవి పాయల్ రాజ్‌పుత్, షాపింగ్ మాల్ యజమాని వెంకటేశ్వర్లు, ఆయన భార్యపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 రోజుల క్రితమే వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, తాజాగా కోర్టు ఆదేశాలతో విషయం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో ఈ నెల 12న పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన జడ్జి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: ఇందిరాకు షర్మిల ఫోన్..