బెంగాలీ హాస్య పాత్రలు ‘బంతుల్ ది గ్రేట్’, ‘హండా భోండా’ ‘నొంటే ఫోంటే’ రూపకర్త, కార్టూనిస్ట్ నారాయణ్ దేబ్నాథ్ చనిపోయారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో మంగళవారం ఉదయం కోల్కతాలో చనిపోయారని ఆయన చికిత్స పొందుతున్న హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత దేబ్ నాథ్ వయసు 97 సంవత్సరాలు. కాగా, డిసెంబరు 24న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు.