దేశంలో కరోనా ఇంకా నిమ్మలం కాలేదు. కేసుల్లో హచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజా కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 13 వేల దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిం చిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 11,35, 142 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12,830 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కాగా, మరో 446 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,58,186కి చేరింది.
కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. కొత్తగా 14,667 మంది కొవిడ్ నుంచి కోలుసుకున్నారు. దీంతో ిరికవరీల సంఖ్య 3.36 కోట్లు (98.20శాతం) దాటింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,59,272కి తగ్గి 247 రోజుల కనిష్ఠానికి చేరింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్క రోజే 68,04,806 మందికి టీకా డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన మొత్తం డోసుల సంఖ్య 1.06 కోట్లు దాటింది.
కరోనా పుట్టినిల్లయిన చైనా దేశాన్ని వైరస్ మరోసారి చుట్టుముడుతోంది. ప్రస్తుతం అక్కడ కొవిడ్-19 కేసులు రోజురో జుకు ఎక్కువవుతున్నాయి. వైరస్ సంక్రమణ వేగంగా ఉంటోందని అక్కడి వైద్యవర్గాలు అధికారికంగా ప్రకటిం చాయి. దీంతో విదేశాల నుంచి వచ్చేవారిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా పోర్టులు, ఈశాన్య సరిహద్దు ల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. వైరస్ నిర్దారణ పరీక్షలు వేగవంతం చేశారు.
అక్టోబర్ 17-27 మధ్య దేశీయం గా 377 కేసులు గుర్తించారు. దేశం వెలుపల ఉన్న క్లస్టర్లతో పోల్చితే ఈసంఖ్య చాలా తక్కువే. ఏదేమైనా మిగతా ప్రపంచం కొవిడ్ మహమ్మారితో ఎలా సహజీవనం చేయాలని అలోచన చేస్తుండగా, చైనా మాత్రం మహ మ్మారిని రూపుమాపే దిశగానే ప్రయత్నాలు కొనసా గించింది. గత 14 రోజుల వ్యవధిలో 14 ప్రావిన్సులలో కొత్త కేసులు వెలుగుచూ శాయని ఎన్‌హెచ్‌సీ అధికార ప్రతినిధి మి ఫెంగ్ చెప్పారు. ఈ కేసులు ఇలాగే కొనసాగితే వైరస్ నియంత్రణ సంక్లిష్టంగా మారొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.