పోలండ్‌కు చెందిన కరోలినా బిలస్కా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నది. ప్యూర్టోరికోలోని షాన్‌జువాన్‌లో జరిగిన 70వ ఎడిషన్ మిస్ వరల్డ్ 2021 పోటీల్లో కరోలినా విజేతగా నిలిచింది. 40 మంది సెమీఫైనలిస్టులను వెనక్కి నెట్టేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ పోటీలలో ప్రపంచ వ్యాప్తంగా 100కిపైగా దేశాలు పాల్గొన్నాయి. అమెరికాకు చెందిన ఇండియన్ ఆరిజన్ శ్రీ సైనీ మొదటి రన్నరప్‌గా, కోట్ డి ఐవరీకి చెందిన ఒలివియా యాస్ రెండో రన్నరప్‌గా నిలిచింది. షాన్ జువాన్‌లోని కొకొ కోలా మ్యూజిక్ హాల్‌లో జరిగిన వేడుకల్లో 69వ ఎడిషన్ విజేత టోని ఆన్ సింగ్ కరోలినాకు ప్రపంచ సుందరి కిరీటాన్ని బహూకరించింది. అమెరికాకు చెందిన శ్రీసైనీ 1వ రన్నరప్‌గా నిలవగా, కోట్ డీ ఐవరీకి చెందిన ఒలివియా యాస్ 2వ రన్నరప్‌గా నిలిచింది. భారత దేశానికి చెందిన మానస వారణాసి టాప్-13 జాబితాలో చోటుదక్కించుకుంది. టాప్-6లోకి ప్రవేశించలేక పోయిన మానస 11వ స్థానంతో సరిపెట్టుకుంది. 2020లో మానస వారణాసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం గెలుచుకుంది.
మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవడం పట్ల బిలస్కా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజేతగా తన పేరు వివగానే షాక్‌కు గురయ్యాను. ఇప్పటికీ నేనే విజేతననే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. మిస్ వరల్డ్ కిరీటం ధరించడం నాకు గర్వకారణం. ప్యూర్టోరికోలోని ఈ అద్భుతమైన అధ్యాయాన్ని జీవితాంతం గుర్తుండిపోతుంది అని తెలిపింది. కాగా, కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంటులో పీజీ చేస్తున్నది. తర్వాత పీహెచ్‌డీ చేస్తానని, అదేవిధంగా మోడల్‌గా కొనసాగుతానని తెలిపింది. బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ చేయడాన్ని ఆమె అమితంగా ఇష్టపడుతుంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 40.9 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.