Friday, November 22, 2024

మేక‌పాల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు..మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మేక‌పాల డైరీలు..

మ‌న‌కు ఎన్నో ర‌కాల పాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న పాల‌ల్లో స‌గం క‌ల్తీవే అనే సంగ‌తి తెలిసిందే. అయితే గేదె, ఆవు పాల‌ను ఎక్కువ‌గా వినియోగిస్తుంటాం. కానీ మేక‌పాలు ఎప్పుడ‌యినా తాగారా..అంటే క‌ష్ట‌మ‌నే చెప్పాలి. అయితే ఈ మేక‌పాల‌తో ప‌లు రోగాల‌కి చెక్ పెట్టొచ్చ‌నే సంగ‌తి మీకు తెలుసా..మ‌రి ఆ వివ‌రాలు చూద్దాం. మేకపాలలో మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్ మొదలైన వాటికి అద్భుతమైన మూలం కావడం వల్ల రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. మేక పాలలో కొవ్వు కణాలు ఇతర పాల కంటే చిన్నవిగా ఉంటాయి. సులభంగా జీర్ణమవుతాయి. మేక పాలలో మీడియం-గ్రేడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి అంతేకాదు కొవ్వుగా అస్సలు నిల్వ ఉండదు. దీంతో బరువు అదుపులో ఉంటుంది. ఇది పేగు సంబంధిత రుగ్మతలు, కరోనరీ వ్యాధుల చికిత్సలో కూడా సహాయపడుతుంది. అందుకే కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం మేకపాల విక్రయాలను చేపడుతుంది.

రీసెంట్ గా మధ్య ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలో మేకపాల డైరీలను నెలకొల్పడం విశేషం. మేక పాలు సులభంగా జీర్ణం అవుతాయి. అందుకే చిన్నపిల్లలకు మంచివని అంటారు. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఒక కప్పు ఆవు పాలకు బదులుగా ఒక కప్పు మేక పాలను తీసుకోవడం చాలా ఉపయోగకరం అంటున్నారు. మేక పాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం ద్వారా చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తాయి. కరోనరీ వ్యాధి నుంచి గుండెను రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మేక పాలు జీవక్రియ ఏజెంట్‌గా పనిచేస్తాయి. ఇది జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యలు, ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడంలో తోడ్పడుతాయి.

మేక పాలు రక్తంలో ప్లేట్‌లెట్లను విపరీతంగా పెంచుతాయి. డెంగ్యూ రాకుండా కాపాడుతుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారికి మేక పాలు మంచి ఎంపిక. చక్కెర అలెర్జీ ఉన్నవారికి మేక పాలు మంచి చాలా మంచివి. మేక పాలలో ఎక్కువగా A-2 (Casien) అనే ప్రొటీన్ ఉంటుంది ఇది అలెర్జీ, పెద్ద పేగు వ్యాధులు, చిరాకు మొదలైన వాటి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఏంటీ మేక‌పాల‌తో ఇన్ని ప్ర‌యోజ‌నాలా అని ఆశ్చ‌ర్య‌పోకండి..ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి కాబ‌ట్టే ఏకంగా డైరీల‌ను నెల‌కొల్పుతున్నారు. ఈ డైరీలు నెమ్మ‌దిగా విస్త‌రించి ఆయా రాష్ట్రాల‌కు వ్యాపిస్తాయేమో చూడాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏ పాలు అయితే ఏంటి చెప్పండి. మ‌రి ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న మేక‌పాల‌ను మ‌నం ట్రై చేద్దాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement