Saturday, November 16, 2024

Spl Story: కోర్టుకెక్కిన కారు రోమాన్స్‌ కథ.. 40 కోట్ల పరిహారం చెల్లించాలని బీమా కంపెనీకి ఆర్డర్​!

వారిద్ద‌రు ల‌వ‌ర్స్‌.. స‌ర‌దాకా అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. అయితే, వారి ఉబ‌లాటం ఆగ‌క‌ కారులోనే రొమాన్స్‌కి దిగారు. అయితే ఇంత‌టితో ఈ రొమాన్స్ క‌థ అయిపోలేదు. ఇది ఓ సుఖ వ్యాధికి దారితీసి కోర్టుదాకా వెళ్లింది. కారులో రొమాన్స్ చేయ‌డం వ‌ల్లే త‌న‌కు రోగం అంటుకుంద‌ని, బీమా కంపెనీ ప‌రిహారం చెల్లించాల‌ని ఆ మ‌హిళ‌ కోరింది.

కొన్ని బీమా కంపెనీలు ఓన్లీ డబ్బులు దండుకోవడానికే చూస్తాయి. సరైన కారణం ఉన్న‌ప్ప‌టికీ నష్టపరిహారం చెల్లించ‌డానికి మ‌స్త్ ఇబ్బంది పెడుతుంటాయి. ర‌క ర‌కాల కారణాలు చెప్పి బీమా ఎగ్గొట్టేందుకు ట్రై చేస్తాయి. కొన్ని కంపెనీలు అయితే ఇంకాస్త వేరే లెవ‌ల్‌లో ఉంటాయి. ప్రమాదం జ‌రిగినా అది త‌మ‌ పాలసీ పరిధిలోకి రాద‌ని కొర్రీలు పెడుతుంటాయి. కానీ, అమెరికాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న మాత్రం ఓ బీమా కంపెనీకి షాక్ ఇచ్చింది. అసలు జరిగిన ప్రమాదం బీమా పాలసీలోకి వస్తుందా? అనే అనుమానం కంపెనీకే కాదు.. చాలా మందికీ వచ్చేసింది.

అమెరికాలోని మిస్సోరీలో ఉంటున్న మ‌హిళ‌ ఓ వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంది. తన భాగస్వామితో కలిసి కారు (పురుష‌ భాగస్వామికి చెందిన కారు)లోనే శృంగారంలో పాల్గొంది. ఈ ఘటన 2017లో జరిగింది. వారిద్ద‌రు సంభోగంలో పాల్గొన్నప్పుడు తన పార్ట్‌నర్‌కు హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ (ఇదో ర‌కం సుఖ‌వ్యాధి) ఉందని తెలిసింది. కారులో రొమాన్స్ చేసిన కారణంగానే ఆ వైరస్ త‌న‌కు సోకిందని కోర్టుకు వెళ్లింది. ఈ వ్యాధి ముదిరితే కేన్సర్‌కు దారితీసే ముప్పు ఉంద‌ని.. ప‌రిహారం చెల్లించాల‌ని పిటిష‌న్‌లో కోరింది. కారులో శారీరకంగా కలవడం మూలంగానే తనకు ప్రమాదకరమైన సుఖవ్యాధి సోకింది కాబట్టి కారు బీమా సంస్థ నష్టపరిహారం చెల్లించాలని వాదించింది. అంతేకాకుండా భవిష్యత్‌లోనూ జరిగే నష్టాన్ని కూడా లెక్కించి తనకు ఏకంగా రూ.77.36 కోట్లు చెల్లించాలని తెలిపింది.

అయితే.. ఈ విచిత్ర కేసును కోర్టు సుదీర్ఘకాలం విచారించింది. కారు ఇన్సూరెన్స్‌కు సంబంధించిన డ్యామేజెస్ అండ్ ఇంజ్యూరీస్ క్లాజ్‌ను పేర్కొంటూ ఆ మహిళకు రూ.40.83 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మహిళ భాగస్వామి అంటే.. ఆ కారు ఓనర్ తనకు సుఖవ్యాధి ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచి పెట్టి ఆ మహిళతో కలిసినట్టు కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ విషయం ఆధారంగా కోర్టు బాధితురాలి పక్షాన తీర్పు ఇచ్చింది. కారులో ప్రయాణిస్తుండగా దాని యజమాని వల్ల జరిగిన ప్రమాదంగా కోర్టు పేర్కొంది. కాబట్టి, కారు యజమాని వల్లే జరిగిన ప్రమాదంగా పేర్కొంటూ బాధిత మహిళకు బీమా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ విచిత్ర కేసు గురించి సోషల్ మీడియాలోనూ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement