హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్లోని అండర్‌పాస్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ వెళ్లి బోల్తా కొట్టింది. ఆదివారం జరిగిన ఈ యాక్సిడెంట్‌తో కారు (TS11EK 8212)లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ కారు హై స్పీడ్ గా నడపడమే యాక్సిడెంట్‌కు కారణమని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే కారుపై హైస్పీడ్‌లో నడిపినందుకు 13,350 రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.