దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. నేటి నుంచి జరిగే మూడో టెస్టులో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్‌టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సారి సిరీస్ విజయమే లక్ష్యంగా భారత జట్టు అడుగుపెట్టింది.
వెన్ను నొప్పితో రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లి పూర్తి ఫిట్‌గా మారి ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. గాయంతో రెండో టెస్టులో తీవ్రంగా ఇబ్బంది పడిన హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఓపెనర్లు రాహుల్, మయాంక్ మరోసారి శుభారంభం చేయనున్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవని భారతజట్టు.. ఈ సారి రికార్డు బ్రేక్ చేయాలని భావిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital