వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20లో భారత జట్టు పటిష్టమైన స్కోరు చేసింది. రోహిత్ శర్మ (64) తన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. దినేశ్ కార్తీక్ ధనాధన్ 19 బంతుల్లో 41 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఒక పక్క వికెట్లు కూలుతున్నా క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుననాడు. హోల్డర్ వేసిన 15వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.
కాగా, ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని సిక్సర్ బాదేందుకు రోహిత్ ప్రయత్నించగా.. లాంగాఫ్‌లో ఉన్న హెట్మెయర్ దాన్ని సులభంగా అందుకున్నాడు. దాంతో రోహిత్ వెనుతిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి ఓవర్లోనే ఆఫ్‌స్టంప్ ఆవలగా అల్జారీ జోసెఫ్ వేసిన బంతిని కట్ చేయడానికి ప్రయత్నించిన జడేజా (16) కూడా.. కీమో పాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
కాగా, వెస్టిండీస్ జట్టు 191 పరుగులు చేయాల్సి ఉంది. ఇక.. శ్రేయర్ అయ్యర్ (0), రిషబ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (1), రవీంద్ర జడేజా (16) పరుగుల చేయగా.. దినేశ్ కార్తీక్41, రవిచంద్రన్ అశ్విన్13 పరుగులతో పర్వాలేదు అనిపించుకున్నారు.