కంటోన్మెంట్ లో అక్రమంగా రోడ్లని మూసివేస్తున్నారని, దాంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతపై కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నిబంధనల ఉల్లంఘనను కేంద్రం ఎందుకు అడ్డుకోవట్లేదని మంత్రి ప్రశ్నించారు. కంటోన్మెంట్‌లో 21 రోడ్లు నిబంధనలకు విరుద్ధంగా మూసివేశారు. మీ ప్రభుత్వం మాత్రం 2 గేట్లు మాత్రమే మూసివేశామని చెబుతుంది. కంటోన్మెంట్ బోర్డు స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే.. కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలిపేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కంటోన్మెంట్ రోడ్డు మూసివేత : జీహెచ్ ఎంసీలో కలిపేయమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్
Advertisement
తాజా వార్తలు
Advertisement