Friday, November 22, 2024

కరోనా ఆంక్షలతో ఆర్థికంగా నష్టపోతాం.. ఎక్కువ కేసులున్న చోటే స్ట్రిక్ట్ రూల్స్: మమతా

కరోనా ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని.. అందుకని ప్రతిచోటా ఆంక్షలు విధించలేమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వచ్చే నెలలో వార్షిక గంగా సాగర్ మేళా ప్రారంభం కానున్న సౌత్ 24 పరగణాల జిల్లాలోని సాగర్ ద్వీపాన్ని సందర్శించిన సందర్భంగా మమతా మీడియాతో మాట్లాడారు. రైళ్లు, విమాన ప్రయాణికుల రాకపోకలకు సెంటర్ గా ఉన్నందున కోల్‌కతాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

“UK నుండి విమానాలలో వచ్చేవారిలో చాలా ఒమిక్రాన్ కేసులు గుర్తించాం. ఒమిక్రాన్ క్యారియర్‌లు అంతర్జాతీయ విమానాల ద్వారా వస్తున్నారనేది వాస్తవం. ఇట్లాంటి కేసులు ఎక్కువగా ఉన్న విదేశాల నుండి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి” అని బెంగాల్ సీఎం మమతా అన్నారు. కాగా, కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ పై తమ ప్రభుత్వం సీరియస్ గానే దృష్టి సారించిందని, అదే విధంగా ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ఆంక్షలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు, “మేము ప్రజల భద్రత, రాష్ట్ర భద్రతను చూసుకోవాలి. త్వరలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాం. కేసులు పెరుగుతున్న ఏరియాలను టార్గెట్ గా చేసుకుని ఆంక్షలు విధిస్తాం. కానీ, యావత్ రాష్ట్రమంతా ఆంక్షలు పెట్టాలంటే కష్టం. ఎందుకంటే ఇది గత రెండు సంవత్సరాల లెక్కనే ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు”, అని సీం మమత అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement