తెలంగాణలో బియ్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని తెలిపింది. ఈ సీజన్ లో 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని పేర్కొంది. గతంలో 44.7లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామని చెప్పామని, ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని చెప్పామని తెలిపింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొంది. పంజాబ్ లో వరి వినియోగం అంతగా ఉండదని, అందుకే 90శాతం ధాన్యం సేకరిస్తున్నామని స్పష్టత ఇచ్చింది. దేశ అవసరాలకు మించి వరి, గోధుమ సాగవుతోందని, పంట మార్పిడి అనివార్యమని కేంద్రం పేర్కొంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement