Sunday, November 10, 2024

మంగ‌ళ‌యాన్ ఉప‌గ్ర‌హాన్ని రిక‌వ‌రీ చేసుకోలేం- ప్ర‌క‌టించిన ఇస్రో

మంగ‌ళ‌యాన్ ఉప‌గ్ర‌హాన్ని రిక‌వ‌రీ చేసుకోలేమ‌ని ప్ర‌క‌టించింది ఇస్రో. అంగారకుడిపై పరిశోధనకు 2013 నవంబర్ 5న పంపిన ఈ ఉప‌గ్ర‌హాన్ని పంపారు. ఈ ఉపగ్రహంలో ఇంధనం అయిపోందని, దీన్ని పునరుద్ధరించడం కష్టమని తెలిపింది. ఇస్రో గత నెల 27న ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ఒక రోజు జాతీయ స్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎనిమిదేళ్ల పాటు అంగారక కక్ష్యలో పరిభ్రమించినందుకు గుర్తుగా దీన్ని నిర్వహించడం గమనార్హం. ఈ సందర్భంగానే ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఉపగ్రహాన్ని తిరిగి పొందలేకపోయినప్పటికీ.. మార్స్ ఆర్బిటర్ మిషన్ అన్నది గ్రహాల అన్వేషణలో విశేషమైన సాంకేతిక, శాస్త్రీయ ఘనతగా పరిగణించబడుతుంద‌ని ఇస్రో ప్రకటించింది. అంగారకుడి ఉపగ్రహం ఉపరితలం, స్వరూపం, వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు ఈ మిషన్ ఉపయోగపడినట్టు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. 2013 నవంబర్ లో ఉపగ్రహ ప్రయోగం జరిగినప్పటికీ.. అంగారక కక్ష్యలో పరిభ్రమించడం మాత్రం 2014 సెప్టెంబర్ 24 నుంచి మొదలు పెట్టింది. తన ఎనిమిదేళ్ల ప్రయాణంలో అంగారక ఉపగ్రహ స్వరూపానికి సంబంధించి ఎన్నో చిత్రాలను మంగళయాన్ పంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement