Tuesday, November 19, 2024

టిక్ టాక్ పై నిషేధం.. ప్ర‌క‌టించిన కెన‌డా

చైనాకి చెందిన యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించింది కెన‌డా. భద్రతా కారణాల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గోప్యత, రక్షణ రిస్క్ లను ప్రస్తావించింది. తాజా నిషేధం టిక్ టాక్ కు పెద్ద షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ కంపెనీ టిక్ టాక్ మాతృ సంస్థగా ఉంది. చైనా సర్కారు పర్యవేక్షణలో నడిచే కంపెనీ కావడం, యూజర్ల డేటాపై కంపెనీకి నియంత్రణ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ పై పలు దేశాల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, అవి ధైర్యంగా నిషేధ నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. 2020లో భారత్ టిక్ టాక్ పై నిషేధం విధించి మొదటి సారి షాక్ ఇచ్చింది. టిక్ టాక్ కు భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉండడమే కాదు. భారీగా యూజర్లను ఆకర్షించే తరుణంలో నిషేధానికి గురైంది. గల్వాన్ లోయ దాడి తర్వాత భారత్ టిక్ టాక్ సహా వందలాది చైనా యాప్ లను నిషేధించి గట్టి బదులిచ్చింది. కెనడా వాసుల ఆన్ లైన్ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement