ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధం ఉందన్న ఆరోపణలపై సిట్ విచారణ ఎదుర్కొంటున్న అడ్వొకేట్ శ్రీనివాస్‌కు మరోసారి అధికారులు నోటీసులు పంపారు. ఇప్పటికే ఒకసారి హైదరాబాద్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణ జరిపిన అధికారులు శ్రీనివాస్ నుంచి పలు కీలక ఆధారాలు రాబట్టారు. దాని ఆధారంగా రాష్ట్ర బీజేపీ నేతలకు కొంతమందికి నోటీసులు పంపే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక.. ఇదే అంశంపై మరోసారి విచారణకు రావాలని నోటీసులు పంపారు. ఫామ్‌హౌస్ ఫైల్స్ కేసులో రెండో నిందితుడు అయిన నందుతో గంటల తరబడి ఏం మాట్లాడారు? అతనితో ఉన్న సంబంధం ఏమిటీ? ఏఏ విషయంలో మాట్లాడారు అనే కాల్ డేటా ఆధారంగా తదుపరి విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది.