ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఢిల్లీ నుంచి గురుగ్రామ్ తీసుకొచ్చి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఆ పనిచేస్తూనే వీడియోలు కూడా తీశాడు. ఇక.. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే వీడియోలను వైరల్ చేస్తానని బాధితురాలిని బెదిరించాడు. ఇక.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల యువతి.. ఐదు నెలల క్రితం అమిత్ అనే వ్యక్తితో ఫోన్ ద్వారా ఫ్రెండ్షిప్ చేసింది. గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో జాబ్ ఉందని అమిత్ చెప్పాడు. బాధితురాలు చాలాకాలంగా ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఈ విషయాన్ని అమిత్‌తో చెప్పగా.. జాబ్ ఇప్పిస్తానని నమ్మకంగా చెప్పాడు. మే 21వ తేదీన అమిత్ తన ఆఫీసు చూపించి.. ఉద్యోగం గురించి మాట్లాడేందుకు గురుగ్రామ్‌కు రావాలని బాధితురాలికి చెప్పాడు.
ఈ క్రమంలో ఆమె అక్కడికి వెళ్లగా.. ధౌలాకువాన్ నుంచి ఆమెను కారులో గురుగ్రామ్ కు తీసుకొచ్చాడు. అక్కడ ఆంబియెన్స్ మాల్ దగ్గర తన ఆఫీసును చూపించాడు. అనంతరం ఆ యువతికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. కారులో కూర్చోబెట్టి రేప్ చేశాడు. ఆ సమయంలో వీడియో కూడా తీశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.